close

తాజా వార్తలు

మహిళపై హత్యాచారం.. మైనర్‌ బాలుడి అరెస్టు

పనాజీ(గోవా): ఓ మహిళపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన కేసులో ఒక మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు గోవా పోలీసులు తెలిపారు. పోర్వోరిమ్‌ సమీపంలోని అడవిలో ఫిబ్రవరి 10న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ 28 సంవత్సరాల మహిళ మృతదేహం అభించింది. మృతురాలు ఒడిశాకు చెందినవారని, గత కొద్ది కాలంగా గోవాలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. 16 సంవత్సరాల బాలుడు మరో వ్యక్తితో కలసి ఆమెపై హత్యాచారానికి పాల్పడినట్టు పోర్వోరిమ్‌ డీఎస్పీ ఎడ్విన్‌ కోలాకో తెలిపారు. ఈ ఇద్దరు వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడయిందని ఆయన వివరించారు. నిందితులపై కేసును నమోదు చేశామని... ఈ ఘటనలో సహనిందితుడైన మరో వ్యక్తిని గురించి అన్వేషణ సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.