కొండగట్టు వద్ద తప్పిన ప్రమాదం

తాజా వార్తలు

Updated : 10/09/2020 15:39 IST

కొండగట్టు వద్ద తప్పిన ప్రమాదం

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ప్రమాదం తప్పింది. ఓ వాహనంలో గేదెలను తీసుకువస్తుండగా అవి ఒక్కసారిగా బెదిరి వాహనం పైనుంచి దూకేశాయి. దీంతో ఆ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్ స్థంభాలను ఢీకొట్టడంతో దానిపై విద్యుత్ స్తంభం, తీగలు పడ్డాయి. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. కారు అదృష్టవశాత్తూ విద్యుదాఘాతానికి గురికాకపోవడంతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. మెట్‌పల్లి మండలం వేడిపల్లికి చెందిన విద్యార్థులు.. కరీంనగర్‌లోని ఓ కళాశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి మల్యాల ఎస్సై నాగరాజు చేరుకుని వివరాలు సేకరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని