కొవిడ్‌ వంకతో ప్రియురాలి చెంతకు 

తాజా వార్తలు

Published : 19/09/2020 01:04 IST

కొవిడ్‌ వంకతో ప్రియురాలి చెంతకు 

భార్యకు అబద్ధం చెప్పి భర్త నిర్వాకం

 

ముంబయి: తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు భార్యకు అబద్ధం చెప్పిన భర్త ప్రియురాలి దగ్గరకు చేరిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబయికి చెందిన వ్యక్తి జులై 21న తన భార్యకు ఫోన్‌ చేసి కరోనా వచ్చినట్లు చెప్పాడు. తాను ఇండోర్‌ వెళ్తున్నానని ఇక తనకు బతకాలని లేదని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అతని బైకు, హెల్మెట్‌, పర్సును స్థానికంగా ఉండే వాషీ ఏరియాలో గుర్తించారు.

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో గాలించినా వ్యక్తి ఆచూకీ దొరకలేదు. సదరు వ్యక్తి చనిపోతానని చెప్పటం, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయటంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానించి మృతదేహం కోసం కూడా గాలించారు. ఎట్టకేలకు.. గత వారం కొవిడ్‌ పేరుతో మాయమైన వ్యక్తి తన పేరు, చిరునామా మార్చి ప్రియురాలితో కలిసి ఇండోర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ముంబయి తీసుకొచ్చి భార్యకు అప్పగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని