close

తాజా వార్తలు

జైపూర్‌లో యువతిపై సహోద్యోగి అత్యాచారం

జైపూర్‌: మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ యువతిపై తోటి ఉద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు బుధవారం స్థానిక ఖో నాగోరియన్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబయికి చెందిన 19 సంవత్సరాల యువతి హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు నిమిత్తం జైపూర్‌లో శిక్షణ పొందుతోంది. శుక్రవారం ఓ క్లబ్‌లో స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీకి ఆమె హాజరయ్యింది. పార్టీ ముగిసిన తర్వాత తన సహోద్యోగి అక్షయ్‌ ఆమెను దగ్గర్లోని హోటల్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎటువంటి అరెస్టు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.