జుత్తాడ హత్యల్లో కొత్త కోణం!
close

తాజా వార్తలు

Updated : 19/04/2021 18:10 IST

జుత్తాడ హత్యల్లో కొత్త కోణం!

అప్పలరాజు ఒక్కడే చంపలేదన్న మృతుల బంధువులు
న్యాయం చేయాలని మంత్రి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం

పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని జుత్తాడలో జరిగిన హత్యల ఘటనలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. హత్యలు చేసింది ఒక్కడే కాదని.. దీని వెనుక ఇంకా ఆరుగురు ఉన్నారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితుడు అప్పలరాజుతో సహా మిగతా వారినీ చంపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌లను మృతుల బంధువులు కలిశారు. ఏమీ తెలియని వారిని కూడా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మృతురాలు అరుణ కుమారుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జుత్తాడ పరిధిలో అప్పలరాజు అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితుడు విజయ్‌ కోరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని