మాస్క్‌లో బంగారం స్మగ్లింగ్‌

తాజా వార్తలు

Published : 02/10/2020 00:50 IST

మాస్క్‌లో బంగారం స్మగ్లింగ్‌

తిరువనంతపురం: బంగారం అక్రమ రవాణాలకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులను వెతుకుతుంటారు. దాదాపు అన్ని రకాల వస్తువులనూ స్మగ్లింగ్‌ చేయడానికి వాడుతుంటారు. ప్రస్తుతం ఆ జాబితాలోకి మాస్కు కూడా చేరింది. వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం యూఏఈ నుంచి కేరళలోని కొజికోడ్‌ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడు తను ధరించిన ఎన్‌-95 మాస్కులోని వాల్వ్‌లో 40 గ్రాముల బంగారాన్ని దాచి పెట్టి స్మగ్లింగ్‌ చేయబోయాడు.

సెక్యూరిటీ గేట్లను దాటి బయటికి వెళ్లే సమయంలో అమర్‌ మహమ్మద్‌ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి ధరించిన మాస్కు ఓ వైపునకు వేలాడుతుండటం.. అతను పదే పదే మాస్కును సరిచేసుకుంటున్న కారణంతో కస్టమ్స్‌ అధికారులు అతడిని ఆగమన్నారు. ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేయగా పట్టుకొని అరెస్టు చేసినట్లు సీనియర్‌ అధికారి వివరించారు. సాధారణంగా మాస్కులను తాము అనుమతించమని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో మాస్కుల వాడకం తప్పనిసరి కావడంతో స్మగ్లర్లు దాన్ని ఆసారాగా మలచుకున్నారని కస్టమ్స్‌ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని