వైద్యం పేరుతో లైంగిక వేధింపులు 

తాజా వార్తలు

Published : 14/10/2020 01:57 IST

వైద్యం పేరుతో లైంగిక వేధింపులు 

తిరువనంతపురం : తన దగ్గరికి వైద్యం కోసం వెళ్లిన యువతిపై ఓ మత బోధకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కేరళ రాష్ర్టంలో చోటు చేసుకుంది. సోమవారం ఓ యువతి అనారోగ్య కారణాలతో ఆయుర్వేద వైద్యుడైన మత బోధకుని దగ్గరికి వెళ్లారు. వైద్యం పేరుతో ఆ వైద్యుడు యువతిని లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొదంటూ యువతిని బెదిరించాడు.

అనంతరం ఆ యువతి తనపై జరిగిన దుశ్చర్యను తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వాళ్లు మత బోధకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యుడు, మత బోధకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో వైద్యుడిగా చలామణి అవుతున్నారు. అతని విద్యార్హత తదితరాలపై విచారణ చేస్తున్నట్లు స్థానిక సీఐ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని