హీరోయిన్ల బెయిల్‌ అభ్యర్థనలు తిరస్కరణ

తాజా వార్తలు

Published : 04/11/2020 00:41 IST

హీరోయిన్ల బెయిల్‌ అభ్యర్థనలు తిరస్కరణ

బెంగళూరు : శాండల్‌ వుడ్‌ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రాణి బెయిల్‌ అభ్యర్థనలను కర్ణాటక హైకోర్టు మరోసారి తిరస్కరించింది. ఆగస్టు నెలలో కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్‌ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు సెప్టెంబరులో హీరోయిన్లు ఇద్దరిని అరెస్టు చేశారు. వీళ్లు పార్టీల్లో డ్రగ్స్‌ తీసుకునేవాళ్లనే ఆరోపణలతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.  

గత రెండు నెలలుగా ఈ ఇద్దరు బెయిల్‌ కోసం పలుమార్లు ప్రయత్నించారు. తాజాగా వీళ్ల అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్‌ శ్రీనివాస్‌ హరీశ్ కుమార్‌ బెయిల్‌ను మరోసారి తిరస్కరించారు. ఆగస్టు నెలలో నార్కోటిక్‌ అధికారులు బెంగళూరులో కొందరు మాదకద్రవ్యాల విక్రేతలను పట్టుకున్నారు. విచారణ జరిపిన పోలీసులు డ్రగ్స్‌ విక్రేతలకు చందనసీమ, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. అధికారులు ఇప్పటి వరకూ ఈ కేసులో 15 మంది వరకూ అరెస్టు చేశారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని