భార్యను హత్య చేసి.. వీడియో గేమ్‌ ఆడుతూ..

తాజా వార్తలు

Published : 08/12/2020 11:20 IST

భార్యను హత్య చేసి.. వీడియో గేమ్‌ ఆడుతూ..

జోద్‌పుర్‌: భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహం పక్కనే తాపీగా వీడియో గేమ్‌ ఆడుతూ కనిపించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జోద్‌పుర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని బీజేఎస్‌ కాలనీకి చెందిన విక్రమ్‌సింగ్‌ (35), శివ్‌ కన్వర్‌ (30) భార్యాభర్తలు. విక్రమ్‌సింగ్‌ జులాయిగా తిరుగుతూ ఏ పని చేసేవాడు కాదు. శివ్‌ కన్వర్‌ కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన విక్రమ్‌సింగ్‌ భార్యపై కత్తెరలతో దాడికి పాల్పడ్డాడు. ఆమెను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. 

అనంతరం అత్తామామలతోపాటు పోలీసులకు విషయాన్ని ఫోన్‌ ద్వారా వెల్లడించాడు. అయితే పోలీసులు అతడి ఇంటికి చేరుకునేసరికి భార్య నెత్తురు మడుగులో పడిఉండగా పక్కనే కూర్చొని సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ కనిపించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఘటన జరిగినప్పుడు వారు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

కృష్ణా జిల్లాలో రక్తమోడిన రహదారులు

భార్య గొంతు కోసి.. ఆపై తానూ కోసుకుని

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని