కుమారుడు జన్మించాలని కూతురి తల నరికిన తండ్రి

తాజా వార్తలు

Published : 15/11/2020 03:06 IST

కుమారుడు జన్మించాలని కూతురి తల నరికిన తండ్రి

రాంచి: సాంకేతిక పరిజ్ఞానంతో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఒళ్లు గగురుపొడిచే సంఘటన చోటుచేసుకుంది. ఓ మంత్రగాడి మాటలు నమ్మిన వ్యక్తి కన్న కూతురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. లాహోర్‌దాగాలోని పేష్రార్‌కు చెందిన సుమన్‌ నగాసియా (26) దినసరి కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. కుమారుడు కావాలనే కోరికతో ఉన్న సుమన్‌కు ఓ మంత్రగాడి గురించి తెలిసింది. దీంతో అతడిని సంప్రదించాడు. అయితే కూతురిని బలిస్తే నీకు మగబిడ్డ కలుగుతాడని ఆ మాంత్రికుడు చెప్పడంతో విచక్షణ కోల్పోయిన సుమన్‌ తన కుమార్తెను చంపేందుకు వెనకాడలేదు. అత్యంత దారుణంగా తల నరికి హత్య చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని