
తాజా వార్తలు
హెల్మెట్ ధరించని వాహనదారులకు వింత శిక్ష..
భోపాల్: ఏదైనా విషయాన్ని వందసార్లు చదవటం, వినటం కంటే ఒక్కసారి రాస్తే బాగా గుర్తుంటుందని పెద్దలు అంటుంటారు. మరి హెల్మెట్ ధరించాలని ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా చెప్పినా చెవికెక్కించుకోని వాహనదారులను దారిలోకి తేవటానికి మధ్యప్రదేశ్ పోలీసులు ఆదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. వారికి జరిమానా విధించటమో లేదా మరే విధమైన శిక్షనో విధించకుండా ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.
‘‘గత ఆరు రోజుల్లో హెల్మెట్ లేకుండా 150 మంది ద్విచక్రవాహనదారులు పట్టుబడ్డారు. వారి భద్రతకు అత్యవసరమైన హెల్మెట్ నిబంధనను ఎందుకు పాటించలేదో తెలుపుతూ కనీసం 100 పదాలతో ఒక వ్యాసాన్ని రాయటమే వారికి శిక్షగా విధిస్తున్నాము. జనవరి 11 నుంచి 17 వరకు ఇక్కడ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేం ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నాము’’ అని ఏఎస్పీ ప్రదీప్ చౌహాన్ తెలిపారు. భద్రతా వారోత్సవాల అనంతరం కూడా ఇదేవిధమైన శిక్షా విధానాన్ని అమలు చేస్తారట. మరి ఈ వింత శిక్ష మన దగ్గర కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందంటారు!
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
