
తాజా వార్తలు
సీఎంను కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లా చౌడవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న హైవే భద్రతా వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన పట్టు రీలర్లు తమ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో హిందూపురం సిల్క్ రీలర్ల సంఘం అధ్యక్షుడు రియాద్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ జీజీహెచ్‌కు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. సీఎంను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
