ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 10 మందికి గాయాలు

తాజా వార్తలు

Published : 25/09/2020 01:07 IST

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 10 మందికి గాయాలు

న్యాల్‌కల్‌: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌ వద్ద ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం వివరాలను హద్నూర్ ఏఎస్సై జగదీశ్వర్ మీడియాకు వివరించారు. జహీరాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్‌ వెళ్తుండగా సిద్దిపేట నుంచి కర్ణాటకలోని బీదర్‌కు వెళ్తున్న పాల లారీ ఎదురుగా వచ్చి బస్సును ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎస్సై చెప్పారు.  ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌తోపాటు మరో 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని