close

తాజా వార్తలు

ప్రకాశంలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

కొనకనమిట్ల: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలిలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కర్ణాటకలోని బళ్లారి వాసులుగా గుర్తించారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.