close

తాజా వార్తలు

కారును ఢీకొన్న లారీ.. నలుగురి మృతి

రామాపురం : కడప జిల్లా రామాపురం మండలం చిట్లూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులను కారులో ప్రయాణిస్తున్న రాయచోటి వాసులు హర్షద్‌ఖాన్‌, హసజీరా, చిత్తూరు జిల్లా కలికిరి మండల వాసులు హారున్‌బాషా, అఫిరాలుగా గుర్తించారు. ప్రొద్దుటూరులో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.