
తాజా వార్తలు
‘గొంతు కోస్తుంటే ఆనందంగా ఉండేది’
విస్తుపోయే విషయాలు వెల్లడించిన సీరియల్ కిల్లర్
గురుగ్రామ్: మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య చేసిన ఓ సీరియల్ కిల్లర్‌ను గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. బిహార్‌కు చెందిన మహమ్మద్ రాజి (22) గురుగ్రామ్‌లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. నవంబర్ 23, 24, 25వ తేదీల్లో ముగ్గురిని అతి దారుణంగా హత్య చేశాడు. మద్యం ఆశచూసి అమాయకులను నమ్మించే రాజి 23న రాత్రి నగరంలోని లీజర్ వ్యాలీ పార్కు సమీపంలో ఓ వ్యక్తి గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు రాత్రి ఓ సెక్యూరిటీ గార్డుని సైతం ఇదే తరహాలో దారుణంగా హతమార్చాడు.
వరుస హత్యలతో అప్రమత్తమైన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తన వికృత చేష్టలను బయటపెట్టాడు. మనుషుల గొంతు కోస్తుంటే ఆనందంగా ఉండేదని పేర్కొనడం గమనార్హం. ప్రపంచానికి తానేంటో చూపించాలనుకున్నానని తెలిపాడు. అయితే విచారణలో 25వ తేదీ రాత్రి మరో హత్య చేసినట్లు వెల్లడించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాకేశ్ కుమార్ (26) అనే వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి శరీరం నుంచి తలను వేరుచేసి మరో ప్రాంతంలో పడేశాడు. ఆ తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
‘చిన్నతనం నుంచే నాకేం అర్థమయ్యేది కాదు. నేను చాలా బలహీనంగా ఉన్నానని, ఏ పనీ చేయలేనని అందరూ నన్ను ఎద్దేవా చేసేవారు. అందుకే నేనేం చేయగలనో ప్రపంచానికి చూపించాలనుకున్నా’ అని రాజి పోలీసుల వద్ద పేర్కొన్నాడు. కాగా నిందితుడు గురుగ్రామ్‌తోపాటు, దిల్లీ, బిహార్‌లో దాదాపు 10 హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి
సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
1500 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
