తండ్రి మరణం తట్టుకోలేక ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

తాజా వార్తలు

Published : 09/08/2020 05:42 IST

తండ్రి మరణం తట్టుకోలేక ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబకలహాలు ఓ తండ్రి, ఇద్దరు కమార్తెల ఆత్మహత్యలకు పురిగొల్పాయి. తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఇద్దరు కమార్తెలు రైలు కింద పడి మరణించారు. వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రొద్దుటూరు వైఎంఆర్‌‌ కాలనీకి చెందిన బాబురెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కమార్తె భర్త వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన బాబురెడ్డి నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్ద అల్లుడి వేధింపుల వల్లే చనిపోతున్నట్ల సెల్ఫీ వీడియో తీసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేని ఇద్దరు కుమార్తెలు ఇవాళ ఉదయం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అక్కతోపాటు ఇంజినీరింగ్‌ చదువుతున్న చెల్లి ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని