Palasa : రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసుల మృతి

తాజా వార్తలు

Updated : 23/08/2021 21:41 IST

Palasa : రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసుల మృతి

పలాస : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిని క్రాస్‌ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మృతుల వివరాలు..

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏఆర్‌ ఎస్సై కె.కృష్ణుడు, వై. బాబూరావు (HC), పి. ఆంటోనీ (HC), పి. జనార్దనరావు (డ్రైవర్‌) ఉన్నట్టు గుర్తించారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని