AP News : గుంటూరు జిల్లాలో అనుమానాస్పదస్థితిలో ఆరుగురి మృతి

తాజా వార్తలు

Updated : 30/07/2021 07:51 IST

AP News : గుంటూరు జిల్లాలో అనుమానాస్పదస్థితిలో ఆరుగురి మృతి

గుంటూరు : గుంటూరు జిల్లాలో అనుమానాస్పదస్థితిలో ఆరుగురు మృతి చెందారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతంతో వీరు మరణించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.  రొయ్యల చెరువు వద్ద రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణం కాదని విద్యుత్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఘటనాస్థలి వద్దకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని