close

తాజా వార్తలు

Updated : 01/12/2020 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చర్నాకోలాతో అర్చకులపై ఆలయఛైర్మన్‌ దాడి!

బండి ఆత్మకూరు: కర్నూలు జిల్లాలో అర్చకులపై ఓ ఆలయ కమిటీ  ఛైర్మన్‌ నిర్దాక్షిణ్యంగా దాడికి పాల్పడ్డారు. బండి ఆత్మకూరు మండలంలోని ఓంకారం పుణ్యక్షేత్రంలో ఈ ఘటన జరిగింది. ఆలయంలో భక్తులకు ఇస్తున్న దర్శన టికెట్లు ఆపేసి ఉచిత దర్శనం కల్పించాలని అర్చకులు కోరారు. దీనిపై ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. టికెట్ల విషయం మీకు సంబంధం లేదని.. మీ పని మీరు చూసుకోవాలంటూ అర్చకులను అసభ్యంగా దూషించారు. అనంతరం చర్నాకోలాతో కొట్టినట్లు అర్చకుడు సుధాకరయ్య తెలిపారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

 



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని