వైద్య సిబ్బంది చేతిలోంచి జారిపడి శిశువు మృతి

తాజా వార్తలు

Updated : 02/11/2020 14:05 IST

వైద్య సిబ్బంది చేతిలోంచి జారిపడి శిశువు మృతి

వనస్థలిపురం ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

వనస్థలిపురం: కాన్పు చేస్తున్న సమయంలో వైద్య సిబ్బంది చేతిలోనుంచి అప్పుడే పుట్టిన శిశువు జారి పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్‌పేటకు చెందిన గర్భిణి(23) శుక్రవారం రాత్రి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున ఆరు గంటలకు మగశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలోనుంచి జారి కింద పడటంతో తలకు గాయమైంది. వెంటనే శిశువును చికిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని