అవుకులో పేలుడు.. తెగిపడిన బాలుడి చేతులు

తాజా వార్తలు

Published : 16/11/2020 01:12 IST

అవుకులో పేలుడు.. తెగిపడిన బాలుడి చేతులు

అవుకు: కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు ప్రభావంతో గ్రామానికి చెందిన 13 ఏళ్ల వరకుమార్ అనే బాలుడి రెండు చేతులు తెగిపడ్డాయి. ముఖం, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది. గాయపడిన చిన్నారిని బనగానపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పెద్దఎత్తున పేలుడు సంభవించడంతో బనగానపల్లి సీఐ సురేశ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని