లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

తాజా వార్తలు

Updated : 17/09/2020 16:27 IST

లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ఒకరు మృతి.. 8 మందికి గాయాలు‌

ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మొక్కజొన్న లోడుతో ఏలూరు వైపు వెళ్తున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు సహాయక డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మొత్తం 34 మంది వలస కూలీలు ప్రమాణిస్తున్నట్లు ఉంగుటూరు ఎస్సై వీర్రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని