close

తాజా వార్తలు

కోడి పందేల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

చింతలపూడి పట్టణం: పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చింతలపూడి మండలంలోని చింతంపల్లి గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తుండగా రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. స్థానికంగా మామిడితోటలో పందేలు నిర్వహిస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది.

గురువారం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఇద్దరు యువకులకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కోడిపందేల విషయంలో వివాదం చోటుచేసుకొంది. ఈ నేపథ్యంలో ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన యువకులు మరికొంతమంది స్నేహితులతో కలిసి ఖమ్మం యువకులపై కర్రలతో దాడి చేశారు. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడికి దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సత్తుపల్లికి చెందిన మారేష్ తలకు తీవ్రగాయాలు కాగా, చింతలపూడికి చెందిన నాగు కాలు విరిగింది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.