రసాయన పరిశ్రమలో గ్యాస్‌లీక్‌.. ఇద్దరు మృతి

తాజా వార్తలు

Published : 20/09/2020 00:45 IST

రసాయన పరిశ్రమలో గ్యాస్‌లీక్‌.. ఇద్దరు మృతి

సంగారెడ్డి అర్బన్ (సదాశివపేట): గ్యాస్‌ వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పైప్‌లైన్‌ పేలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది గ్రామంలో గాయత్రి గ్యాస్‌ పరిశ్రమలో సంగారెడ్డి పట్టణానికి చెందిన వాల్మీకి అరవింద్ (53), కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్వరాజ్(66)లు విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం పరిశ్రమలో గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్‌లీకై ఒక్కసారిగా పైప్‌లైన్ పేలింది. పేలుడు ధాటికి ప్లాంట్‌ మేనేజర్, మెకానిక్‌ ఇన్‌ఛార్జ్‌ ఇద్దరూ ఎగిరిపడ్డారు. గమనించిన పరిశ్రమ సిబ్బంది వారిద్దరినీ సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు స్పల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని