ఫోన్‌ ప్లాంట్‌పై కార్మికుల దాడి

తాజా వార్తలు

Published : 13/12/2020 02:04 IST

ఫోన్‌ ప్లాంట్‌పై కార్మికుల దాడి

జీతాలు చెల్లించలేదంటూ ఫర్నీచర్‌ ధ్వంసం

బెంగళూరు: కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నర్సాపురలో ఉన్న ప్రముఖ కంపెనీకి చెందిన ఫోన్లను తయారుచేసే విస్టర్న్‌ కార్పొరేషన్‌ ప్లాంట్‌పై కార్మికులు దాడి చేశారు. జీతాలు చెల్లించడం లేదంటూ ప్లాంట్‌లోని అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ప్లాంట్‌పై ఒక్కసారిగా దాడికి దిగారు. కార్యాలయంలోని అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను విరగ్గొట్టారు. వాహనాలను సైతం తగలబెట్టారు.

కార్మికుల దాడిలో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని కోలార్‌ ఎస్పీ కార్తీక్‌ రెడ్డి వెల్లడించారు. ప్లాంట్‌ సమీపంలో రెండు వాహనాలను తగలబెట్టారని చెప్పారు. దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే లాఠీఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టామని తెలిపారు. దోషులను గుర్తిస్తామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం ఖండించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని డిప్యూటీ సీఎం సీఎన్‌ అశ్వత్‌నారాయణ్‌ అన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవీ చదవండి..
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని