ఒప్పుకోలేదని నాలుక కోసేశారు..

తాజా వార్తలు

Published : 19/11/2020 02:00 IST

ఒప్పుకోలేదని నాలుక కోసేశారు..

జైపూర్‌ (రాజస్థాన్‌): తమ సమీప బంధువును పునర్వివాహం చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో కోడలి ముక్కు, నాలుక కోసిన అమానుష ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో మంగళవారం జరిగింది. స్థానిక పోలీసు అధికారి కాంటా సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జైసల్మేర్‌కు చెందిన బాధితురాలి (28) భర్త ఆరేళ్ల క్రితం మరణించాడు. అప్పటికి వారి వివాహమై ఏడాదే అయ్యింది. అప్పటి నుంచి బాధితురాలి అత్తమామలు, ఆడపడుచు తమ సమీప బంధువైన ఓ వ్యక్తిని పునర్వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని బాధితురాలు ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన అమ్మగారింటి దగ్గర ఉన్న సమయంలో అత్తామామలు ఆమెపై దాడి చేసి ముక్కు, నాలుక కత్తిరించి, కుడి చేతిని విరగ్గొట్టారు. ఆ సమయంలో వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బాధితురాలికి తల్లికి కూడా గాయాలయ్యాయని పోలీసులు వివరించారు. ఈ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సహ నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని