భర్త కళ్లముందే సామూహిక అత్యాచారం!

తాజా వార్తలు

Published : 10/12/2020 01:09 IST

భర్త కళ్లముందే సామూహిక అత్యాచారం!

రాంచీ: ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్ల ముందే ఓ మహిళపై 17 మంది అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ అమానవీయ సంఘటన ముఫాసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఓ మహిళ తన భర్తతో కలిసి బయటికెళ్లి పని ముగిశాక ఇంటికి తిరుగు పయనమైంది. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు మార్గమధ్యంలో వారిని అడ్డుకున్నారు. అనంతరం వారు ఆమె భర్తపై దాడి చేసి.. అతడి కళ్లముందే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు ప్రారంభించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

ఆహారం ముట్టుకున్నాడని దారుణ హత్య


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని