close

తాజా వార్తలు

Published : 18/10/2020 02:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కీచక చర్య.. 15 ఏళ్లుగా అత్యాచారం

భోపాల్‌: బ్లాక్‌మెయిల్‌ చేస్తూ 15 ఏళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిని బాధితురాలు హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండే ఓ మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లికి ముందు 2005లో ఓ ఆగంతకుడు చేతిలో అత్యాచారానికి గురైంది. ఆ దుశ్చర్యను అతడు వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆ వీడియోను బయట పెడతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బయటపెడితే కుటుంబం నాశనమవుతుందనే ఉద్దేశంతో మహిళ ఈ చర్యను ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చింది.

మహిళ భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఆ వ్యక్తి మరోసారి అత్యాచారం చేయడానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్లూ ఈ కీచక చర్యను భరించిన మహిళ తిరగబడింది. కత్తితో కసితీరా 25 సార్లు పొడిచి అతడిని హత్య చేసింది. అనంతరం స్థానిక పోలీసు స్టేషనుకు వెళ్లి లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం మహిళను అరెస్టు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.