బంజారాహిల్స్‌లో గోనెసంచిలో మృతదేహం

తాజా వార్తలు

Updated : 30/08/2020 16:45 IST

బంజారాహిల్స్‌లో గోనెసంచిలో మృతదేహం

జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 2లో పాదచారుల బాటపై ఓ గోనె సంచిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సంచిలో మృతదేహం ఉన్నట్లు అనుమానంతో స్థానికులు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కొవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని గోనెసంచిని తెరిచారు. సంచిలో సుమారు 60 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం ఉంది. ఒంటిపై  ఏమైనా గాయాలున్నా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం ద్వారా మృతదేహాన్ని ఎవరు పడేశారనేది తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మహిళ ఎవరనేది తెలియాల్సి ఉందని, శవపంచనామా ద్వారా అసలు విషయం వెల్లడయ్యే వీలుందని పోలీసులు తెలిపారు. మహిళను హత్యచేసి ఇక్కడపడేశారా? మరేదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని