
తాజా వార్తలు
రూ. 200 ఇవ్వలేదని యువకుడి హత్య
ఉత్తర్‌ప్రదేశ్: కేవలం రూ. 200 అడిగితే ఇవ్వలేదని ఓ యువకుడిని కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రద్దీగా ఉండే శంషాద్ మార్కెట్ ప్రాంతంలో అన్సర్ అహ్మద్(30) టైర్స్ రిపేర్ షాపు నడిపిస్తున్నాడు. అన్సర్‌కు పరియస్థుడు అసిఫ్ రిపేర్ షాపు వద్దకు వచ్చి మోటార్ సైకిల్ కావాలని అడిగాడు. దీనికి అన్సర్ నిరాకరించాడు. అసిఫ్ మళ్లీ షాపు దగ్గరకు వచ్చి రూ. 200 ఇవ్వాలని అన్సర్‌ను డిమాండ్ చేశాడు. అతడు లేవని సమాధానమిచ్చాడు. దీంతో అసిఫ్ తన పాకెట్లో నుంచి నాటు తుపాకి తీసి ఒక్కసారిగా అన్సర్ తలపై కాల్చాడు. ఈ ప్రమాదంలో అన్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడు అన్సర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. నిందితుడు ఘటన సమయంలో మత్తు పదార్థాలు తీసుకుని హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ కుమార్ తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
