రూ. 200 ఇవ్వలేదని యువకుడి హత్య

తాజా వార్తలు

Published : 30/11/2020 01:01 IST

రూ. 200 ఇవ్వలేదని యువకుడి హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌: కేవలం రూ. 200 అడిగితే ఇవ్వలేదని ఓ యువకుడిని కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రద్దీగా ఉండే శంషాద్‌ మార్కెట్‌ ప్రాంతంలో అన్సర్‌ అహ్మద్‌(30) టైర్స్‌ రిపేర్‌ షాపు నడిపిస్తున్నాడు. అన్సర్‌కు పరియస్థుడు అసిఫ్‌  రిపేర్‌ షాపు వద్దకు వచ్చి మోటార్‌ సైకిల్‌ కావాలని అడిగాడు. దీనికి అన్సర్‌ నిరాకరించాడు. అసిఫ్ మళ్లీ షాపు దగ్గరకు వచ్చి రూ. 200 ఇవ్వాలని అన్సర్‌ను డిమాండ్‌ చేశాడు. అతడు లేవని సమాధానమిచ్చాడు. దీంతో అసిఫ్‌ తన పాకెట్‌లో నుంచి నాటు తుపాకి తీసి ఒక్కసారిగా అన్సర్‌ తలపై కాల్చాడు. ఈ ప్రమాదంలో అన్సర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడు అన్సర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. నిందితుడు  ఘటన సమయంలో మత్తు పదార్థాలు తీసుకుని హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని