సెల్ఫీ మోజు.. యువకుడు గల్లంతు!

తాజా వార్తలు

Published : 19/09/2020 17:24 IST

సెల్ఫీ మోజు.. యువకుడు గల్లంతు!

జడ్జర్ల గ్రామీణం (మహబూబ్‌నగర్‌)‌: సెల్ఫీపై మోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దుందుబి వాగులో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన జడ్చర్ల మండలంలోని లింగంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో దుందుబి వాగు ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామానికి చెందిన అఫ్రోజ్‌ (22) అనే యువకుడు లింగంపేట దుందుబి వాగుపై ఉన్న చెక్‌ డ్యామ్‌లో శనివారం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సరదాగా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తూ నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. తోటి యువకుల కళ్ల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో వారు ఆందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న జడ్చర్ల సీఐ వీరాస్వామి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన యువకుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జడ్చర్ల నియోజకవర్గంలో దుందుబి వాగు ఉద్దృతంగా ప్రవహిస్తుండడంతో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని