Honour killing: కూతురు ప్రేమ పెళ్లిచేసుకుందని తండ్రి ఘాతుకం.. ఆరుగురి సజీవదహనం!

తాజా వార్తలు

Published : 20/10/2021 01:08 IST

Honour killing: కూతురు ప్రేమ పెళ్లిచేసుకుందని తండ్రి ఘాతుకం.. ఆరుగురి సజీవదహనం!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కన్నకూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుదుర్చిన సంబంధం వద్దని తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఇంటికి నిప్పంటించాడు. ఈ మంటలకు ఆ ఇంట్లో ఉన్న తన ఇద్దరు కూతుళ్లతో పాటు నలుగురు చిన్నారులూ సజీవదహనమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణం సెంట్రల్‌ పాకిస్థాన్‌లోని ముజఫర్‌గఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫౌజియా బీబీ (19) తన తండ్రి మంజూర్‌ హుస్సేన్‌ ఇష్టానికి వ్యతిరేకంగా 18 నెలల క్రితం మెహబూబ్‌ అహ్మద్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. కూతుర్ని ఎలాగైనా అంతమొందించాలని భావించిన మంజూర్ హుస్సేన్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసు అధికారి అబ్దుల్‌ మాజీద్‌ వివరించారు. ఈ ఘటనలో ఫౌజియా బీబీ, ఆమె నాలుగు నెలల కొడుకుతో పాటు మంజూర్‌ హుస్సేన్‌ మరో కుమార్తె ఖుర్షిద్‌ మే (35), ఆమె ముగ్గురు పిల్లలూ మృతిచెందారు. 

ఈ ఘటనపై  ఫౌజియా భర్త మెహబూబ్‌ అహ్మద్‌ని పోలీసులు ప్రశ్నించగా.. ఆ సమయంలో తాను ఇంటి వద్ద లేనన్నారు. వ్యాపారం నిమిత్తం ముల్తాన్‌కు వెళ్లానని, తిరిగి తెల్లవారుజామున వస్తుండగా.. ఘటనా స్థలం నుంచి మంజూర్‌ హుస్సేన్‌, అతని కుమారుడు షాబిర్‌ హుస్సేన్‌లు పారిపోవడం చూసినట్టు పోలీసులకు చెప్పారు. తమ వివాహం తండ్రీకొడుకులిద్దరికీ ఇష్టంలేదన్నారు. ఈ ఘటనలో తన నాలుగు నెలల కొడుకుతో పాటు ఖుర్షిద్‌ మే ముగ్గురు పిల్లలు కూడా సజీవదహనమయ్యారని పోలీసులకు తెలిపారు. మరోవైపు, తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకుంటున్న కారణంగా ఏటా వందలాది మంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నట్టు పాకిస్థాన్‌ మానవహక్కుల కమిషన్‌ గణాంకాలు పేర్కొంటున్నాయి. మంజూర్‌ హుస్సేన్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని