AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Published : 17/06/2021 01:39 IST

AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం

న్యూదిల్లీ: దేశరాజధాని దిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో అగ్ని ప్రమాదం జరిగింది. కన్వర్జెన్స్‌ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం 22 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. బుధవారం రాత్రి 10.32 నిమిషాల సమయంలో ఆసుపత్రి భవనంలోని తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన తొమ్మిదో అంతస్తులో పలు లాబోరేటరీలు, అధునాతన పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని