
తాజా వార్తలు
చనిపోయినా పట్టించుకోలేదు.. కరోనా భయంతో
కరీంనగర్: నగరంలోని కశ్మీర్‌గడ్డ రైతు బజారు వద్ద విషాదం చోటు చేసుకుంది. కూరగాయల కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కరోనా భయంతో స్థానికులు మృతదేహం వద్దకు రావడానికి కూడా జంకుతున్నారు. స్థానికులు సమాచారం తెలపడంతో అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లో ఇటీవల ఇండోనేసియాకు చెందిన వారు సంచరించడం, కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కావడంతో ప్రజలు ఆందోళనతో ఉన్నారు.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు