గొంతు కోసుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 09:57 IST

గొంతు కోసుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో అభిలాష్‌ అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధి ముసారాంబాగ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే అభిలాష్‌.. కుటుంబంతో కలిసి మూసారాంబాగ్‌లో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల కిందట భార్య, ఇద్దరు పిల్లలను కోదాడలోని అత్తగారింట్లో వదిలి ఇంటికి వచ్చాడు. అభిలాష్‌ నిన్న రాత్రి తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో తలుపు బద్దలుకొట్టి చూడగా అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కత్తితో గొంతు, చేతి మణికట్టు వద్ద కోసుకొని అభిలాష్‌ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని