TS NEWS: ఏసీబీ వలలో యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌

తాజా వార్తలు

Published : 29/07/2021 17:43 IST

TS NEWS: ఏసీబీ వలలో యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌

యాదాద్రి: యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువాం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వెంచర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌.. డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా డబ్బులు డిమాండ్‌ చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడి సమయంలో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా తలుపులు వేసి సోదాలు కొనసాగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని