బైక్‌ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

తాజా వార్తలు

Published : 18/02/2021 01:47 IST

బైక్‌ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

పొదిలి: ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో  ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.  ఒంగోలు నుంచి పొదిలి వస్తున్న ద్విచక్రవాహనాన్ని పొదిలి నుంచి ఒంగోలు వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు కనిగిరి మండలానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రహదారి గుంతలమయంగా ఉండటమే ఘటనకు కారణమని స్థానికులు ఆరోపించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని