చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

తాజా వార్తలు

Updated : 14/03/2021 02:56 IST

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

రాయదుర్గం: అనంతపురం జిల్లా కొంతనపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గానికి చెందిన మురళీ, అశోక్‌ కలిసి ఈ ఉదయం కారులో కనేకల్‌ బయల్దేరారు. కొంతనపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని