రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడి మృతి

తాజా వార్తలు

Updated : 11/04/2021 13:51 IST

రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడి మృతి

గుంటూరు: రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోట్లపాడుకు చెందిన శ్రీనివాసరావు, పార్వతీ దంపతులకు గోపీచంద్‌, ఊర్మిళ సంతానం. గోపీ ఇంటర్‌ చదువుతుండగా, ఊర్మిళ బీటెక్ విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఉదయం మరో స్నేహితురాలితో కలిసి వీరిద్దరూ బైకుపై వెళుతుండగా.. మేడికొండూరు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే అక్కాతమ్ముడు ప్రాణాలు విడిచారు. దీంతో బాధిత కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని