TS News: భయానకం ఈ ప్రమాదం 

తాజా వార్తలు

Published : 30/06/2021 01:07 IST

TS News: భయానకం ఈ ప్రమాదం 

మాదాపూర్‌: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ఆడీ కారు ఆటోను ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు నిందితుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అతివేగంగా వచ్చిన కారు.. ఆటోను ఢీకొట్టగా ఆటో పల్టీలు కొట్టింది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. నగరానికి చెందిన సుజిత్ రెడ్డి, ఆశిష్‌లు రాయదుర్గంలోని స్నేహితుని ఇంట్లో విందుకు హాజరయ్యారు. మద్యం సేవించి మత్తులోనే కారులో బయలుదేరారు. కారు నడుపుతున్న సుజిత్‌రెడ్డి మైహోం ఆబ్రా వద్ద మితిమీరిన వేగంతో ఆటోను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఆటో అనేక పల్టీలు కొట్టగా.. అందులోని ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించాడు. ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. 

కాగా ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు సుజిత్‌, ఆశిష్‌లు కారు నంబర్‌ ప్లేట్లను తొలగించి పారిపోయారు. అనంతరం సుజిత్‌ తండ్రి మరో డ్రైవర్‌ను తీసుకొని అతడే యాక్సిడెంట్ చేశాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సీసీ టీవీ దృశ్యాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. ప్రమాదానికి కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని