close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120025856 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/635914280551770 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/635914280551770 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-23 14:01:54.367137 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

నిన్న కాల్పులు జరిపి..నేడు ఆత్మహత్య

గుంటూరు: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోమన్నందుకు తుపాకీతో కాల్పులు జరిపిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కింద పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బాలాజీ మృతదేహాన్ని అతనిబంధువులు గుర్తించారు. 

 ఏం జరిగిందంటే...
 అతడు ఆర్మీ ఉద్యోగి. బంధువుల పెళ్లిలో చూసిన అమ్మాయిని.. ప్రేమ అంటూ దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. మాటలు నమ్మిన ఆ అమ్మాయి అతడికి దగ్గరైంది. మోజు తీరిన తరువాత నువ్వు వద్దంటూ యువతిని దూరం పెట్టాడు. పెళ్లి చేసుకోవాలని పెద్దల ద్వారా కోరినా పట్టించుకోలేదు. మోస పోయానని గ్రహించిన ఆమె కేసు పెట్టింది. కటకటాల పాలయ్యాడు. ఉద్యోగం నుంచి పక్కన పెట్టడంతో కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు.. నాటు తుపాకీతో తెగబడి తల్లీకూతుళ్లపై కాల్పులు జరిపాడు. గురితప్పడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలానికి చెందిన యేమినేని బాలాజీ ఆర్మీ ఉద్యోగి. కొన్ని నెలల క్రితం పరిచయమైన అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరిక తీర్చుకున్నాడు. చివరికి పెళ్లికి తిరస్కరించడంతో ఆమె ఫిర్యాదు మేరకు డిసెంబరులో బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. 

ఆర్మీ నుంచి సస్పెన్షన్‌కు గురికావడంతో యువతి, ఆమె తల్లిపై బాలాజీ కక్ష పెంచుకున్నాడు. దాడి చేయాలని ఇరవై రోజుల్లో మూడుసార్లు రాత్రిపూట రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం అర్ధరాత్రి నాటు తుపాకీతో వచ్చి తలుపు కొట్టాడు. అమ్మాయి తల్లి తలుపు తీయగా గోడచాటు నుంచి కాల్చాడు. ఆమె పక్కకు తప్పుకోవడంతో తూటా కుడి చెవికి తాకుతూ వెళ్లింది. ఆమె అరుపులకు పక్కింటి వ్యక్తి వచ్చి నిందితుడ్ని అడ్డుకున్నా కాల్పులు ఆపలేదు. మొత్తం మూడు రౌండ్‌లు కాల్పులు జరిపాడు. స్థానికులు గుమికూడటంతో తుపాకీని, వెంట తెచ్చిన బ్యాగ్‌ను అక్కడే వదిలి పారిపోయాడు. ఎస్సై రమేష్‌ ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన అమ్మాయి తల్లిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాలాజీ కోసం పోలీసులు గాలిస్తుండగా ఆదివారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.