lockup death: పోలీసులపై చర్యలు
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 04:58 IST

lockup death: పోలీసులపై చర్యలు

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్ఐ మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్‌, జానయ్యలపై వేటు పడింది. ముగ్గురినీ సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనలో సీపీ మహేశ్‌ భగవత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. లాకప్‌డెత్‌ వ్యవహారంలో మల్కాజ్‌గిరి ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావును దర్యాప్తు అధికారిగా నియమించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌ను సీపీ మహేశ్‌భగవత్‌ ఆదేశించారు.

ఏం జరిగిందంటే?

రూ.2 లక్షల దొంగతనం కేసులో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మ(55)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజే ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించి రూ.1.35 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన రూ.65 వేల కోసం శుక్రవారం మరియమ్మను పిలిపించి పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె సృహతప్పింది. పోలీసులు హుటాహుటిన ఆమెను పోలీసు వాహనంలో తొలుత స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు, తర్వాత ఆయన సూచన మేరకు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సాయంత్రం బయటకు పొక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. విచారణ సమయంలో పోలీసులు చేయి చేసుకోవడంతోనే మరియమ్మ చనిపోయినట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని