
తాజా వార్తలు
లాయర్ దంపతుల హత్య: దర్యాప్తు ముమ్మరం
పెద్దపల్లి: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంథని కోర్టులో రామగిరి పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితుడు బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చడంపై బిట్టు శ్రీనుపై అభియోగాలు ఉన్నాయి. ఈ నెల 19న ముగ్గురు నిందితులను ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లిన పోలీసులు.. హత్య సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి
Tags :