AP News: గుంటూరులో ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య‌
close

తాజా వార్తలు

Updated : 22/05/2021 13:47 IST

AP News: గుంటూరులో ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య‌

గుంటూరు: ఒంటిపై యాసిడ్ పోసుకొని వ్య‌వ‌సాయ ఉద్యోగిని ఉమాదేవి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న గుంటూరులో చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు .. ఉమాదేవి కుమారుడు బాజీ కిర‌ణ్‌ ఈ నెల 8న క‌రోనాతో మృతిచెందాడు. అప్ప‌టి నుంచి కుటుంబంలో ఆస్తుల విష‌యంలో వివాదం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఇవాళ త‌న కార్యాలయంలోని భూసార ప‌రీక్ష కేంద్రంలో బాధితురాలు ఒంటిపై యాసిడ్ పోసుకున్నారు. గ‌మ‌నించిన స్థానికులు జీజీహెచ్‌కు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఉమాదేవి మృతిచెందారు. న‌గ‌రంపాలెం పోలీసులు వేధింపులే  ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు. కోడలి ఫిర్యాదుపై విచార‌ణ పేరుతో ఉమాదేవిని వేధించార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని