Drugs case: అనన్యా..  మళ్లీ విచారణకు రండి: ఎన్‌సీబీ

తాజా వార్తలు

Published : 22/10/2021 01:45 IST

Drugs case: అనన్యా..  మళ్లీ విచారణకు రండి: ఎన్‌సీబీ

ముంబయి: ముంబయి నగరంలో క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ వ్యవహారంలో సినీనటి అనన్యా పాండే విచారణ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు విచారించిన నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శుక్రవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌ వాట్సాప్‌ చాట్‌లో అనన్య పేరు వెలుగులోకి రావడంతో ఆమె ఇంట్లో ఈరోజు ఎన్‌సీబీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను విచారణకు రావాలని సమన్లు ఇవ్వగా.. తండ్రితో కలిసి అనన్యా పాండే ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చారు. అనన్యను ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సహా పలువురు అధికారులు పలు అంశాలపై విచారించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన విచారణ ముగిసిన అనంతరం ఆమె కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మరోవైపు, ఆమె నుంచి ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఫోన్‌డేటాను పరిశీలించే అవకాశం ఉంది.

మరోవైపు, క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ వ్యవహారంలో ఆర్యన్‌ ఖాన్‌కు ముంబయి ప్రత్యేక న్యాయస్థానం నిన్న బెయిల్‌ నిరాకరించిన విషయం తెలిసిందే.  ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఆయన డ్రగ్స్‌ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టుగానే కనబడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల బెయిల్‌ ఇవ్వలేమని చెప్పింది. దీంతో ముంబయి హైకోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. ఆర్యన్‌ మొబైల్‌ ఫోన్‌లో వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా మరో ఇద్దరు బాలీవుడ్‌ తారలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ముబయిలోని నాలుగు చోట్ల ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్యన్‌ ఖాన్‌ సహా పలువురి నిందితుల జ్యుడీషియల్‌ కస్టడీని ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 30 వరకు పొడిగించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని