Crime News: పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి.. మహిళా కానిస్టేబుల్‌ మృతి

తాజా వార్తలు

Published : 25/07/2021 01:30 IST

Crime News: పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి.. మహిళా కానిస్టేబుల్‌ మృతి

జహానాబాద్‌: బిహార్‌లోని జహానాబాద్‌లో పోలీసులు, స్థానికులకు మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ మహిళా కానిస్టేబుల్‌ మృతిచెందారు. కుంతీదేవి అనే కానిస్టేబుల్‌ పైనుంచి ఓ వాహనం దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మద్యం మాఫియాకు చెందిన ఓ వ్యక్తి పోలీసు కస్డడీలో మరణించడంతో ఆగ్రహించిన అతడి గ్రామస్థులు పోలీసులపై దాడికి దిగారు. గ్రామంలో భద్రత కోసం వచ్చిన వారిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. గ్రామస్థుల దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గ్రామస్థులు వారి వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం అదనపు సిబ్బందితో వచ్చిన పోలీసులు దాడికి దిగినవారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలతో జహానాబాద్‌-అర్వాల్‌ రహదారిలో గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని