మారని మృగాళ్లు..ఆరేళ్ల బాలికపై అత్యాచారం!

తాజా వార్తలు

Published : 07/10/2020 02:27 IST

మారని మృగాళ్లు..ఆరేళ్ల బాలికపై అత్యాచారం!

అలీఘఢ్‌: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత యువతిపై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే అదే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. అలీఘఢ్‌లో ఓ ఆరేళ్ల బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కోత్వాలి సదాబాద్‌ ప్రాంతంలోని జతోయ్‌ గ్రామంలో పదిరోజుల క్రితం ఓ ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన బాలికను దిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతిచెందింది. దీంతో కోపోద్రిక్తులైన బాలిక బంధువులు గ్రామంలోని రహదారులను నిర్బంధించి అలీఘఢ్‌ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని