అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ
close

తాజా వార్తలు

Published : 27/02/2021 01:07 IST

అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ

గుంటూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకేసు వివరాలను రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ మీడియాకు వెల్లడించారు.  ‘‘అనూషను సహ విద్యార్థి విష్ణువర్థన్‌రెడ్డే హత్య చేశాడు. వేరే యువకుడితో చనువుగా ఉందని విష్ణుకి అనుమానం వచ్చింది. దీంతో ..ఈనెల 24న అనూషను నరసరావుపేట శివారుకు తీసుకెళ్లాడు. ఆమెను నిలదీయడంతో పాటు గొడవపడ్డాడు. కోపంతో ఆమె గొంతు నులిమి చంపాడు. హత్య తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని చూశాడు. స్థానికుల సమాచారంతో హత్య విషయం బయటకొచ్చింది. అనూష హత్య చాలా బాధాకరం. హత్యకు సంబంధించి ఆధారాలు శాస్త్రీయంగా సేకరించాం. హత్యకేసులో ముద్దాయికి శిక్ష పడేలా చూస్తాం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరతాం’’ అని ఎస్పీ వివరించారు.

అనూష హత్యను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 2 సెంట్ల ఇళ్ల స్థలం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని